Andhra PradeshHome Page Sliderhome page slider

వాడికి ఎందుకంత కొవ్వు.. అధికారిపై ఎమ్మెల్యే రుబాబు

ఏపీలోని శ్రీకాకుళంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ నోరు పారేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు.. నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదు అంటూ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు. గత కొన్ని రోజులుగా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవి కుమార్ పై టీడీపీ ఎమ్మెల్యే, నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ రవి కుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో.. అతన్ని తీయొద్దు అంటూ ఎమ్మెల్యే వద్దకు గ్రామస్థులు వెళ్లారు. రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతనిని తొలగించొద్దని ఎమ్మెల్యేను గ్రామస్థులు వేడుకున్నారు. ఏం చేయాలో నాకు తెలుసు మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడారు.