వాటిని నిల్వచేస్తే చర్యలు.. కేంద్రం
సరిహద్దుల్లో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్న వేళ వ్యాపారులు నిత్యావసర వస్తువులు నిల్వచేయకూడదని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సరిహద్దు రాష్ట్రాల ప్రజలు పెద్దమొత్తంలో సరుకులను నిల్వచేసుకోవడంపై ప్రభుత్వం స్పందించింది. ప్రజలు ఆందోళన చెందవద్దని దేశంలో సరిపడా నిత్యావసర వస్తువు లభ్యత ఉందని అక్రమ నిల్వలు చేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఇలా నిల్వ చేయడంపై ఇప్పటికే చంఢీగడ్‌లో నిషేధం విధించారు. అధికారులు వ్యాపారుల వద్ద ఉన్న నిల్వల సమాచారాన్ని మూడు రోజులలో సేకరించాలని పేర్కొన్నారు. పంజాబ్, జమ్ముకశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలలో కూడా ఇలాంటి హెచ్చరికలు చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, పాక్ నుండి దాడులు జరిగే అవకాశం ఉందని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హెచ్చరించింది.

