ఆర్మీ కోసం తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల ప్రకారం తెలంగాణలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నేషనల్ డిఫెన్స్ ఫండ్‌కి ఒక నెల వేతనం విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలతో చర్చించి, త్వరలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విరాళం ప్రకటిస్తారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ఇతర పార్టీల నుండి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు రావాలని కోరారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

