ఆర్టీసీ బస్సులో పొన్నం
తెలంగాణ సిద్దిపేట జిల్లా దుద్దేడ టోల్ గేట్ నుండి సిద్దిపేట కలెక్టరేట్ వరకు కరీంనగర్ డిపో ఆర్టీసీ బస్సు లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రయాణం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ లో అందుతున్న ఉచిత ప్రయాణం పై ఆరా తీశారు. ఆర్టీసీ డ్రైవర్ ,కండక్టర్ లతో మాట్లాడారు. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేస్తామని నిన్న జేఏసీ నాయకులతో జరిగిన సమావేశంలో కూడా చెప్పినట్టు వారితో గుర్తు చేశారు. సమ్మె పై వెనక్కి తగ్గి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసినందుకు ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.