నార్త్ ఇండియా హై అలర్ట్..ఎయిర్‌పోర్టులు బంద్
ఆపరేషన్ సింధూర్ పేరతో పాక్‌లోని ఉగ్రస్థావరాలను పేల్చేసింది భారత సైన్యం. ఈ దాడులతో ముందుజాగ్రత్త చర్యగా నార్త్ ఇండియాలోని పలు ఎయిర్ పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జమ్ము, శ్రీనగర్, ధర్మశాల, లేహ్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, ఛండీగఢ్, రాజ్‌కోట్ విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేసింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతే తమ ప్రాధాన్యత అని తెలియజేసింది. ఖతార్ ఎయిర్‌వేస్, స్పైస్ జెట్ సంస్థలు వారి విమానాలను రద్దు చేశాయి. పాకిస్థాన్‌లోని 9 ప్రాంతాలలో ఉగ్రస్థావరాలపై భారత సైన్యం అర్థరాత్రి మెరుపుదాడులు చేసింది.