సత్తా ఉన్న నాయకుడైతే పత్తా లేకుండా ఎందుకు పోయాడు..
కేసీఆర్ సత్తా ఉన్న నాయకుడే అయితే పత్తా లేకుండా ఎందుకు పోయాడని మంత్రి సీతక్క బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. మీటింగులకు వచ్చి తిడతాడు కానీ అసెంబ్లీకి మాత్రం రాడని అన్నారు. కేసీఆర్ ఇంకా దొర అనే భావనతో ఉండి ఫామ్ హౌసే పరిపాలనా కేంద్రం అనుకుంటున్నాడని ఎద్దేవా చేశారు సీతక్క. బాధ్యత గల ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వకుండా మాపై అవాకులు చెవాకులు పేలుస్తున్నారని పేర్కొన్నారు. పదేళ్లలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి ఉన్నది ఉన్నట్లు చెబితే తప్పేముంది? అని మంత్రి సీతక్క చెప్పారు.