భద్రతా మండలిలో పరువు పోగొట్టుకున్న పాక్..
భారత్ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని పాక్ ఆశ్రయించింది. అయితే ఈ సమావేశంలో తన పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. తన చెప్పుతో తానే కొట్టుకున్నట్టయ్యింది పాక్ పరిస్థితి. దీనిపై సమావేశమైన భద్రతామండలి సభ్యదేశాలు పాక్‌పైనే ప్రశ్నల వర్షం కురిపించింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ చేసిన వాదనను తిరస్కరించడమే కాకుండా.. పహల్గామ్ ఉగ్రదాడి వెనక లష్కరే టెర్రరిస్టుల ప్రమేయంపై పాక్ ప్రతినిధిని గట్టిగా నిలదీసింది యునైటెడ్ నేషన్స్. ఉగ్రదాడిని ఖండిస్తూ, బాధ్యులను శిక్షించాలంటూ మండలిలో ఏకాభిప్రాయాన్ని ప్రకటించాయి సభ్యదేశాలు. మతం ఆధారంగా టూరిస్టులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించాయి. క్షిపణి పరీక్షలు, అణ్వస్త్ర ప్రయోగాలు, పాక్ మంత్రుల రెచ్చగొట్టే ప్రకటనలను తప్పుబట్టింది. సమస్యలను భారత్‌తో ద్వైపాక్షికంగా పరిష్కరించుకోవాలని పాక్‌ను సూచించింది. పౌరులను టార్గెట్ చేయడం సహించేమని తేల్చి చెప్పింది. భారత్-పాకిస్తాన్ యుద్ధానికి వెళ్లకూడదని సమితి సలహా ఇచ్చింది. యుద్ధనివారణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడానికైనా.. తాము సిద్ధంగా ఉన్నామని సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నమిలారు పాక్ ప్రతినిధులు.

