మంచి మనసున్న మాస్టారు..
ప్రభుత్వ పాఠశాలలో చదువుకోని మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు బెళుగుప్ప మండలానికి చెందిన ఎంఈఓ మల్లారెడ్డి గొప్ప ఆఫర్ ఇచ్చారు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో జరిగింది. విద్యార్థులకు విమానయానం చేయిస్తానని విద్యార్థులకు మాటిచ్చారు. మాటిచ్చిన ఎంఈఓ సొంత డబ్బులతో బెంగుళూరు నుంచి హైదరాబాద్ కు విమానంలో తీసుకువచ్చి హైదరాబాద్ లోని పర్యాటక ప్రదేశాలను చూపించారు. దీంతో విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం పరుస్తూ ఎంఈఓకు కృతజ్ఞతలు తెలిపారు.

