Home Page Sliderhome page sliderTelangana

భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యాయత్నం

తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో చింతలపాలెం మండల కేంద్రంలో భూ భారతి సదస్సును అధికారులు నిర్వహించారు. అయితే దొంగల నాగరాజు అనే రైతు తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లోని పెట్రోల్‌ను మీద పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు రైతును పక్కకు తీసుకెళ్లారు. తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని, దీంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు తెలిపాడు. అదే సదస్సులో మరో మహిళా రైతు కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.