‘అతడు నన్ను ఒంటరిగా వదలడు భయ్యా’..కోహ్లి సెటైర్లు
విరాట్ కోహ్లి అంటే అభిమానులకే కాదు..సహచర ఆటగాళ్లకు కూడా చాలా ఇష్టం. యువ ఆటగాళ్లు చాలామంది అతని చుట్టూనే తిరుగుతూ ఉంటారు. ఇటీవల ఒక చిట్‌చాట్‌లో భాగంగా విరాట్ కోహ్లి సరదా ప్రశ్నలకు బదులిచ్చాడు. “రూమ్మేట్గా ఎవరిని కోరుకోరు?” అనే ప్రశ్నకు వెంటనే “స్వస్తిక్ చికారా! ఎందుకంటే అతను నన్ను ఒంటరిగా వదలడు భయ్యా” అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఈ ఆన్సర్ సరదాగానే చెప్పినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వస్తిక్ చికారా గురించి మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అతను కేవలం సహచరుడిగా మాత్రమే కాకుండా, విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ఆటగాడిని దగ్గరగా పరిశీలిస్తూ నేర్చుకోవడానికి తగిన అవకాశాన్ని పొందుతున్నాడు. యువ ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశమే అని చెప్పాలి. విరాట్ చుట్టూ ఉండటమే ఒక మోటివేషన్‌గా మారుతుంది, ఎందుకంటే అతని ఫిట్నెస్, నిబద్ధత, ఆటపట్ల ఉన్న ప్యాషన్ ఈ తరం క్రికెటర్లకు గొప్ప ఉదాహరణ.