విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా విజయవాడలో నేడు రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల మీదుగా వాహనాల మళ్లింపు మళ్లింపు చేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నుంచి వచ్చే భారీ వాహనాలు పొట్టిపాడు టోల్‌ప్లాజా దగ్గర నిలిపివేస్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు ఇబ్రహీంపట్నం టెర్మినల్ దగ్గర నిలిపివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. గతంలో అర్ధాంతంగా నిలిచిపోయిన అమరావతి పనులు మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలుకొని, మోదీ బహిరంగసభ వరకు ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి మంత్రులు, కూటమినేతలు స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా 3గంటల 15నిమిషాలకు వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి.. అక్కడ చంద్రబాబు, పవన్‌లు స్వాగతం చెప్పనున్నారు. ఆ తర్వాత హెలిప్యాడ్ నుంచి సభావేదిక వరకు ప్రధాని రోడ్‌షో కూడా ఉండనుంది. అమరావతి పునః ప్రారంభవేదిక నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ.

