పసిడి ప్రియులకు శుభవార్త..
బంగారం ధరలు పెరుగుతూ, తగ్గుతూ పసిడి ప్రియులను ఊరిస్తున్నాయి. ఇటీవల భారీగా పెరిగిపోయి, 10 గ్రాముల ధర రూ. లక్ష దాటిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు రూ. 2 వేల మేరకు తగ్గిపోయింది. అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. 24 క్యారెట్ల ధర పది గ్రాములకు రూ.2,180 తగ్గి రూ.95,730కి చేరింది. గత 10 రోజుల నుండి దాదాపు రూ. 5 వేల మేరకు తగ్గింది. ఏప్రిల్ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ తర్వాత ఆ దూకుడు కొనసాగించలేదు. ఇప్పటి వరకూ మధ్యలో ఒకసారి మాత్రమే స్వలంగా పెరిగింది. మొత్తంగా ఈ 10 రోజుల్లో 10 గ్రాములకి రూ.5,620 ధర తగ్గింది. వెండి ధర రూ.2వేలు తగ్గి రూ.98,000లుగా ఉంది.