చాట్‌జీపీటీకి పోటీగా మెటా ఏఐ యాప్..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఓపెన్ ఏఐసంస్థ చాట్‌జీపీటీ చాట్‌బాట్ సేవలతో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ విభాగంలో పోటీ ఇస్తున్న మెటా కూడా తన సేవల్ని మరింత మెరుగుపరుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా మెటా ఏఐ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రత్యేక ఫీచర్లతో ఈ అప్లికేషన్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ పేర్కొంది. లామా 4 లాంగ్వేజ్ మోడల్‌తో రూపొందించిన కొత్త ఏఐ యాప్‌ను మెటా లాంచ్ చేసింది. ఈ ఏఐతో మాట్లాడటం మరింత సులభమని తెలిపింది. ఎటువంటి ప్రశ్నలకైనా సునాయాసంగా సమాధానం చెప్పగలదని కంపెనీ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ఫేస్‌బుక్‌లో ప్రతిరోజూ చాలామంది మెటా ఏఐని వినియోగిస్తున్నారు. ఈ యూజర్లకు మెరుగైన ఫీచర్లను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అప్లికేషన్‌ను పరిచయం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకూ ఈ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది.