ఇంటర్నెట్, వైఫై లేని ఫోన్లు, టీవీలు..గుడ్ న్యూస్ చెప్పిన సంస్థలు
ఎలాంటి ఇంటర్నెట్, వైఫై కనెక్షన్స్ లేకుండా టీవీలు, మొబైల్స్ పనిచేసేలా చేయడానికి ఒక సరికొత్త టెక్నాలజీతో ముందుకొస్తున్నాయి హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్ సంస్థలు. గతంలో నోకియా మొబైల్స్‌ను తయారు చేసిన ఈ హెచ్ఎండీ సంస్థ ఫ్రీస్ట్రీమ్ టెక్నాలజీస్‌తో కలిసి డీ2ఎం ఫోన్లను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. లావా ఇంటర్నేషనల్ సంస్థ కూడా డీ2ఎం ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 ఈవెంట్లో ఈ రెండు కంపెనీల సరికొత్త మొబైల్స్‌ను ప్రదర్శించనున్నారు. అలాగే టీవీ ప్రసారాల కోసం యూహెచ్ఎఫ్ ఏంటెన్నాతో ముందుకొస్తున్నారు. ఎఫ్ఎం రేడియో తరహాలో టీవీ కార్యక్రమాలు అందించే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని దేశీయంగా రూపొందించారు.

