Home Page SliderInternationalNewsPolitics

‘సహనం నశించింది..ఇక ఆ ఒప్పందం రద్దు’..భారత్

భారత్-పాక్‌ల మధ్య 1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ తాజాగా రద్దు చేసింది. గతంలో పాక్‌తో యుద్ధాలు, సైనిక ఘర్షణలు జరిగినప్పుడు కూడా భారత్ ఈ ఒప్పందం రద్దు చేయలేదు. ఎందుకంటే నదీ జలాలు జీవనాడుల వంటివి. వాటిని రద్దు చేస్తే తాగునీరు లేక దేశం ఎడారి అయిపోతుంది. కానీ ఈ సారి మాత్రం సాధారణ పౌరులపై ఉగ్రదాడితో సహనం నశించిందని, అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ ఒప్పందంతో పాక్‌కు భారీ నష్టమే కలగనుంది. పాకిస్తాన్‌కు అత్యధిక నీటి సరఫరా ఈ నదీ జలాల వల్లే కలుగుతుంది. సింధూ, జీలమ్, చీనాబ్ నదుల నీరు ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కు వెళ్తుంది. వీటితో పాటు బియాస్, సట్లెజ్ నదుల నీరు కూడా వెళ్తుంది. ఇప్పుడు ఈ ఒప్పందం సస్పెండ్ చేయడంతో పాక్ తీవ్రంగా కరువు ఏర్పడుతుంది.