పహల్గాం మృతులకు కేంద్ర హోం మంత్రి నివాళి
పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన మృతులకు కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్చాం ఉంచారు అమిత్ షా. అనంతరం దాడిలో గాయపడి అనంత్ నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు అమిత్ షా. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పాల్గొన్నారు. మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్ లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.