Home Page SliderTelangana

రాహుల్ లెటర్ పై స్పందించిన రేవంత్

తెలంగాణలో వేముల రోహిత్ యాక్ట్ తీసుకురావాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రిక్వెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ట్విటర్ గా స్పందించారు. జపాన్ లోని హిరోషిమా చారిత్రక నగరంలో రాహుల్ లేఖను చదివినట్లు పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ, తాను అక్కడే మహాత్మా గాంధీజీ విగ్రహం ఉన్న పవిత్ర స్థలాన్ని సందర్శించబోతున్నప్పుడే అది జరిగిందని చెప్పారు. చట్టం తీసుకురావాలని కోరడం స్ఫూర్తిదాయకమైన పిలుపు అన్నారు. ఆయన ఆలోచనలు, భావాలను ముందుకు తీసుకెళ్తామని రేవంత్ ట్వీట్ చేశారు.