Home Page SliderTelangana

షాప్ యజమానిపై బాలుడు పోలీస్ కంప్లైంట్

బొమ్మ హెలికాప్టర్ ఎగరడం లేదని అమ్మిన షాప్ యజమానిపై ఓ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల కేంద్రంలో జరిగింది. కంగ్టి లో ఉన్న తన అమ్మమ్మ ఇంటి వద్ద జరిగే ఒక జాతరకు తాతతో కలిసి వెళ్లిన వినయ్ రెడ్డి (10) అనే బాలుడు, జాతరలో రూ.300 పెట్టి ఒక బొమ్మ హెలికాప్టర్ కొన్నాడు. అది ఎగరకపోవడంతో రెండోసారి వెళ్లి ఆ హెలికాప్టర్‌ను ఇచ్చి వేరే బొమ్మ తెచ్చుకున్నాడు.. అది ఎగరకపోవడంతో మూడోసారి మళ్లీ వెళ్లగా యజమాని వేరేది ఇచ్చాడు. ఆ హెలికాప్టర్ కూడా ఎగరకపోవడంతో బొమ్మను వాపస్ ఇవ్వడానికి వెళ్లగా, షాప్ యజమాని బొమ్మను తీసుకోకుండా బాలుడిపై కోప్పడ్డాడు.. దీంతో షాప్ యజమాని తనను మోసం చేశాడని బాలుడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జాతరకు ఒక కానిస్టేబుల్‌ను పంపగా, అప్పటికే షాప్ యజమాని జాతర నుండి వెళ్ళిపోయాడు.. దీంతో బాలుడి తాతను పిలిచి, బాలుడిని సముదాయించి ఇంటికి పంపించారు.