లేడీ అఘోరిపై జోగిని సంధ్య ఫిర్యాదు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరి, శ్రీ వర్షిణి వ్యవహారం సంచలనంగా మారింది. అఘోరిపై షామీర్పీట్ పోలీస్ స్టేషన్లో జోగిని సంధ్య ఫిర్యాదు చేశారు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తోందని, హిజ్రాలకు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తోందని సంధ్య ఆరోపించారు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఇలాంటి వాళ్లను సమాజం నుంచి తరిమి కొట్టాలని జోగిని సంధ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.