Home Page SliderTelangana

లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రుల ధర్నా

హీరో రాజ్ తరుణ్ తల్లిదండ్రులు లావణ్య ఇంటి ముందు ధర్నాకు దిగారు. లావణ్య తమను బయటకు గెంటేసిందని రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అంటున్నారు. ప్రస్తుతం తాము ఉంటున్న ఇళ్లు రాజ్ తరుణ్ కొన్నాడని ఆయన తల్లిదండ్రులు చెబుతున్నారు. మరోవైపు ఇంటిని రాజ్ తన పేరు మీద రాశాడని లావణ్య ఆరోపిస్తోంది. మరోవైపు తాను ఉంటున్న ఇంటి నుంచి వెళ్లగొట్టడానికి 15 మంది ప్రయత్నించారని లావణ్య ఆరోపించారు. వారు తనపై దాడికి దిగి.. అసభ్యంగా ప్రవర్తించారని ఆమె తెలిపింది. తనను కొడుతున్న రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఆపలేదని వివరించింది. ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని లావణ్య పేర్కొంది.