ChatGPT ను ఇలా కూడా వాడతారా?
ఓ వ్యక్తి పుచ్చకాయ కొనేందుకు కూడా చాట్ జీపీటీ వినియోగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. Chat GPT సాయంతో అతడు స్వీట్ & రెడ్ గా ఉన్న పుచ్చకాయనీ గుర్తించాలని కోరాడు. చాట్‌జీపీటీ సాయంతో అతడు వివిధ రకాల పుచ్చకాయలను పరిశీలించాడు. కొన్నింటిని పరిశీలించాక ఒకదానిని అది సూచించింది. కట్ చేసి చూడగా పండు ఎర్రగా ఉంది. అది చూసిన పుచ్చకాయ అమ్మేవాడు షాక్ కు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తూ.. దీనిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కానీ ఈ వీడియో ఎక్కడిదో తెలియలేదు.