Andhra PradeshHome Page Slider

సింగపూర్‌లో అగ్ని ప్రమాదం.. పవన్‌ కల్యాణ్ కుమారుడికి గాయాలు

సింగపూర్‌లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. మార్క్ శంకర్‌కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగిసిన తర్వాత పవన్‌ కళ్యాణ్ సింగపూర్‌ కు బయలుదేరనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.