దేశభక్తి చిత్రాల సీనియర్ హీరో మృతి..
బాలీవుడ్‌లో ప్రముఖ దేశభక్తి చిత్రాల హీరో, దర్శకుడు మనోజ్ కుమార్(87) నేడు ముంబయిలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొంత కాలంగా ఆయన హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆయన బాలీవుడ్‌లో ఉపకార్, పురబ్ ఔర్ పశ్చిమ్, క్రాంతి వంటి దేశభక్తి చిత్రాలెన్నింటినో తెరకెక్కించారు. దీనితో ఆయనను మనోజ్ కుమార్ అని కాక భరత్ కుమార్ అంటూ అభిమానులు పిలుచుకుంటారు. ఆయన అసలు పేరు హరిక్రిషన్ గిరి గోస్వామి. సినిమాల నుండి తప్పుకున్న తర్వాత ఆయన రాజకీయాలలో ప్రవేశించి, బీజేపీ పార్టీలో చేరారు. అయితే పదవులు స్వీకరించలేదు. ఆయన భారతీయ సినిమాకు చేసిన కృషికి కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డునిచ్చి గౌరవించింది.