Home Page SliderInternationalNewsNews AlertPolitics

‘భారత్‌ను చూసి నేర్చుకోండి’..ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా భారత ఎన్నికల విధానాన్ని, నియమాలను మెచ్చుకున్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు సిద్ధమయ్యారు. ఓటు నమోదు కోసం పౌరసత్వం రుజువు చూపించడం తప్పనిసరి చేశారు. దీనికోసం భారత్ విధానాలను ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. భారత్, బ్రెజిల్ వంటి దేశాలు ఓటరు గుర్తింపుని బయోమెట్రిక్‌ డేటాబేస్‌తో అనుసంధానిస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోదని పేర్కొన్నారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు మాత్రం ఓట్లు లెక్కించేటప్పుడు పేపర్ బ్యాలెట్ పద్దతినే ఇంకా పాటిస్తున్నాయి. అమెరికా ఎన్నికల ప్రక్రియలో మాత్రం చాలా లోపాలున్నాయి అని పేర్కొన్నారు. అలాగే ఎన్నికల సమయాలలో అమెరికా పౌరులు విరాళాలు ఇవ్వకూడదని నిషేధం విధించారు. మోసాలు, లోపాలు లేని స్వేచ్ఛాయుత, నిజాయితీ గల ఎన్నికలు నిర్వహించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.