Home Page SliderTelangana

సాగర తీరంలో ఐపీఎల్ సందడి

విశాఖలో క్రికెట్ అభిమానులు ఐపీఎల్ ఫీవర్ పట్టుకుంది. ఇవాళ రాత్రి 7.30 గంటలకు విశాఖ వేదికగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం సర్వం సిద్దం చేశారు. స్టేడియం వద్ద 1700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ లైట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. గ్రౌండ్ లో కొద్ది రోజుల కిందట 34 ఆడియన్స్ బాక్సులను కూడా ఏర్పాటు చేశారు విశాఖలో జరగనున్న రెండు మ్యాచుల కోసం రూ.40 కోట్లతో వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియాన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దారు. మ్యాచ్ కి రెండు గంటల ముందుగా ప్రేక్షకులను లోపలికి అనుమతిస్తారు. ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ మ్యాచ్ కి విచ్చేసి తిలకించనున్నారు. ఆయనతోపాటు ఉత్తరాంధ్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు మ్యాచ్ ను వీక్షించనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది.