డీలిమిటేషన్ సమావేశంపై బండి రియాక్షన్..
చెన్నైలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా జరిగిన సమావేశంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. చెన్నైలో జరిగింది డీలిమిటేషన్ సమావేశం కాదు… చంబల్ లోయ ముఠా సమావేశం అని ఎద్దేవా చేశారు. ప్రజల దారి మళ్లించేందుకే డీలిమిటేషన్ పేరుతో డ్రామాలాడుతున్నారని బండి ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని తేలిపోయిందన్నారు. అక్కడ లిక్కర్ మాఫియా.. మరొకరు ల్యాండ్ మాఫియా కలిసి సమావేశంలో పాల్గొన్నారని ధ్వజమెత్తారుడిలిమిటేషన్ పై కేంద్రం ఇంకా గైడ్ లైన్స్ నిర్ణయించక ముందే సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు.