రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేకుండే..
తెలంగాణ బడ్జెట్ పై చర్చ సందర్భంగా శాసన సభలో స్పీకర్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. రోడ్ల నిర్మాణం అంశంపై హరీశ్ రావు వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య డైలాగ్ వార్ నడిచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రమంతా రోడ్లు వేశామని హరీశ్ రావు చెప్పగా కలుగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. మా వికారాబాద్ జిల్లాల్లో రోడ్లు లేక అబ్బాయిలకు పిల్లనిచ్చే పరిస్థితి కూడా లేదని వ్యాఖ్యానించారు. దీంతో సభలో సభ్యులు నవ్వారు. అధికార పార్టీ సభ్యులు ‘షేమ్.. షేమ్..’ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మాట్లాడిన హరీశ్ రావు పాత మండలాల ప్రకారం అన్ని మండలాల్లో రోడ్లు వేశామని చెప్పారు.