Andhra PradeshHome Page Slider

మందుబాబులకు గుడ్ న్యూస్.. 99/- రూపాయలకే క్వార్టర్

ఏపీలో రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యం అందుబాటులోకి వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. మొత్తం 1.20 కోట్ల క్వార్టర్ సీసాలను ఈ నెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆయన చెప్పారు. కాగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న 5 మద్యం తయారీ కంపెనీలను రాష్ట్రంలో మద్యం విక్రయాలు చేసేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. అయితే ఈనెల 21 నాటికి మరో 20 వేల కేసులకు క్వార్టర్ బాటిల్స్ సరఫరా అవుతుందన్నారు. దశల వారీగా సరఫరా పెరిగి ఈ నెలాఖరు నాటికి 2,40,000 కేసుల మద్యం రాష్ట్రంలో అందుబాటులో ఉంటుందని వివరించారు. ప్రజల వినియోగాన్ని బట్టి వచ్చే నెలలో ఎంత మద్యా న్ని దిగుమతి చేసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు.