ఈ ప్రాచీన కళలో 96 ఏళ్ల బామ్మకి రాష్ట్రపతి పురస్కారం
కర్ణాటకకు చెందిన 96ఏళ్ల భీమవ్వ ఈ వయస్సులో కేంద్ర ప్రభుత్వ ఉన్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా ఆమె వణుకుతున్న చేతులతో అవార్డు అందుకున్నారు. భారత దేశ ప్రాచీన సంప్రదాయ కళ షాడో తోలుబొమ్మలాట కళాకారిణిగా ఆమెకు ఈ అవార్డు లభించింది. ఆమె 16 ఏళ్ల వయసు నుండే ఈ కళను ప్రదర్శించడం మొదలుపెట్టారు. తన కళా నైపుణ్యంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తున్నారు. ఆమె గత 80 ఏళ్లుగా పురాణ కథలను ప్రజలకు ఆకట్టుకునేలా సంగీతంతో పాటు బొమ్మల కదలికతో ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రజలు ఆదరిస్తున్నా, లేకున్నా తన ప్రదర్శనలు ఆపకుండా భావితరాల కోసం అవిశ్రాంతంగా ఈ విద్యను బోధిస్తున్నారు. దీనిని కన్నడలో ‘తొగలు గొంబెయాట’గా పిలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ కళ తరతరాలుగా ఉండేది.