Home Page SliderNational

అట్టుడికిన మణిపూర్ -9 మంది మృతి

ఈశాన్యరాష్ట్రం మణిపూర్‌లో మరోసారి హింసాత్మక సంఘటనలు చెలరేగాయి. దుండగులు  కాల్పులకు తెగబడడంతో తొమ్మిది మంది మరణించారు. వారిలో ఒక మహిళ కూడా ఉన్నారు. గ్రామ వాలంటీర్లు, ఉగ్రవాదుల మధ్య ఇంఫాల్ తూర్పు జిల్లాలోని ఖమెన్‌లక్ అనే ప్రదేశంలో ఈ కాల్పులు, ఎదురుకాల్పులు జరిగాయి. పలువురు గాయపడ్డారు. గతంలో ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపూర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన శాసనసభ్యుల మద్దతు లభించింది. దీనివల్ల గిరిజనులు వారిని ఎస్టీల్లోకి చేర్చడానికి అంగీకరించడం లేదు. అప్పటి నుండి తీవ్ర ఘర్షణలు జరుగుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శాంతి కమిటీని ఏర్పాటు చేసినా లాభం లేకపోయింది. దీనితో మళ్లీ రాష్ట్రంలో కర్ఫూలు, రాకపోకలపై ఆంక్షలు కఠినతరం చేశారు.