8th వండర్ కేఏ పాల్.. మునుగోడులో రికార్డులు బద్ధలు
మునుగోడు ఉపఎన్నిక ఎన్నో సంచలనాలకు కారణమయ్యింది. ఉపఎన్నికలో గెలిచేది మేమంటే మేమేనని.. అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ హోరాహోరీ తలపడితే… నేనొక్కడిని ఉన్నాను.. 50 వేలతో గెలుస్తానంటూ రంకెలు పెట్టాడు ఓ శాంతి దూత. అవును మీరు అనుకున్నట్టుగా ఆ వ్యక్తి మరెవరో కాదు.. ఆయన కేఏ పాల్.. ఆనంద్ కిలారి.. కేఏ పాల్.. మునుగోడు ఉపఎన్నికలో 50 వేల ఓట్లతో గెలుస్తానంటూ సవాళ్లు విసిరాడు. తాను గెలవకుంటే మరింకేదో జరిగిందని రుజువన్నాడు. కట్ చేస్తే మునుగోడు ఉపఎన్నికలో కేఏ పాల్‌కు పడిన ఓట్లు ఎన్నంటే 805. మొత్తం పోలైన ఓట్లలో కేఏ పాల్‌కు 0.36 పోలయ్యాయి. వాస్తవానికి ఎన్నో విమర్శలు, ప్రతివిమర్శలతో మెయిన్ స్ట్రీమ్ పార్టీలను తలదన్ని ఎన్నికల్లో పోటీ చేసిన కేఏ పాల్.. మీడియాను పూర్తి స్థాయిలో వాడుకున్నాడు. ఐతే ఓటర్లను ప్రలోభపెట్టలేదన్న అభిమానాన్ని సంపాదించుకున్నాడు. మునుగోడులో కేఏ పాల్‌కు 8వ అత్యధిక ఓట్లు పొందిన అభ్యర్థిగా నిలిచాడు. టోటల్‌గా 8th వండర్‌గా రికార్డు బుక్కుల్లో ఎక్కాడు.

ఐతే కేఏ పాల్‌కు ఉన్న పాపులార్టీకి తగినట్టుగా ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తే బాగుండన్న చర్చను నెటిజెన్లు తెస్తున్నారు. పాల్‌కు ఓటేసిన 805 మందికి శతకోటి దండాలంటున్నారు. మునుగోడులో కేఏ పాల్ చేసిన హంగామా చూసి ప్రజలంతా నవ్వుకున్నారు. టికెట్ లేకుండా ఫ్రీ షో చూపించాడని సంబరపడిపోయారు. మునుగోడు ఎన్నిక జరిగినన్నాళ్లు కేఏ పాల్ దూకుడు అంతా ఇంతా కాదు. పరుగులు తీయడం, గంతులు వేయడం, ఉంగరాలతో హడావుడి చేయడం, ఒకసారి వ్యవసాయం చేయడం, మరోసారి మరోలా కన్పించడం ఇలా.. అన్ని రకాలుగా తన కేరెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ ఎన్నికలన్నవి కాస్టిలీగా మారిన తర్వాత కేఏ పాల్ లాంటి నేతలు రాజకీయాలు చేయడం కష్టమన్పిస్తోందనుకోవాల్సింది. పాల్ నువ్వు చాలా చేశావ్.. కానీ నీకు మునుగోడు ప్రజలు సారీ చెప్పారు. కానీ త్వరలోనే మళ్లీ నిన్న మరో మోడ్‌లో చూస్తామన్న నమ్మకంతో ఇక సెలవు…

