Home Page SliderTelangana

రాజేంద్రనగర్‌లో 8 మంది ల్యాండ్ గ్రాబర్లు అరెస్ట్..

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో దుండగులు భూకబ్జాకు పాల్పడ్డారు. ఎన్నారైకి చెందిన ఫ్లాట్‌ను ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి.. బండ్లగూడలో ఉన్న ఎన్నారై ఫ్లాట్‌ను 4.50 కోట్లకు నిందితులు విక్రయించారు. 14 మందినీ నిందితులుగా పోలీసులు గుర్తించారు. 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నిందితుల వద్ద నుండి రెండు కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.