6 రోజుల్లో అదానీ స్టాక్ నష్టాలు 8 లక్షల 21 వేల 775 కోట్లు
జనవరి 24 నుండి, ఏడు లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు $100 బిలియన్లకు పడిపోయింది. అంటే సుమారుగా భారతీయ రూపాయల్లో చెప్పాలంటే దాని విలువ సుమారు 8 లక్షల 21 వేల కోట్లు. గ్రూప్ కంపెనీ స్టాక్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఫిబ్రవరి 2న ₹561.75 లేదా 26.39% తగ్గి ₹1,566.95కి పడిపోయింది. “అదానీ స్టాక్స్ ఓవర్ వాల్యుయేషన్ ఆశ్చర్యం కలిగించనప్పటికీ, మోసం, మార్కెట్ మానిప్యులేషన్ వివరణాత్మక ఆరోపణలు చాలా భయంకరంగా ఉన్నాయి. గత సంవత్సరం సోషల్ మీడియాలో దీని గురించి పుకార్లు వచ్చాయి. కానీ అదానీ గ్రూపునకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అదానీ స్టాక్‌లు పెరుగుతూనే ఉన్నాయి. ఇండెక్స్‌లో కూడా చేర్చారని రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, CEO సోనమ్ శ్రీవాస్తవ అన్నారు.

అదానీ, హిండెన్‌బర్గ్ మధ్య టగ్ ఆఫ్ వార్ ఇంకా కొనసాగుతుండగా, అదానీకి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. ఆస్తులు కరిగిపోతున్నా.. కంపెనీ విలువ పడిపోతున్నా… ఎవరూ కూడా ఆయన పక్షం వహించలేదు. అదే సమయంలో అదానీ షేర్లు వేగంగా పెరుగుతున్నా… అసలు లావాదేవీలు ఎలా ఉన్నాయన్నదానిపై… వ్యాపార ప్రక్రియ, ధర చర్యలను పరిశోధించడానికి రెగ్యులేటర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితికి స్పష్టత వస్తుందని, నియంత్రణాధికారులు చర్యలు తీసుకుంటారన్న మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

2022లో అత్యధిక సంపద సంపాదించిన అదానీ, ఈ ఏడాది ధనవంతుల జాబితాలో అత్యధికంగా నష్టపోయిన వ్యక్తి. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, అతను 2023లో ఇప్పటివరకు దాదాపు $36 బిలియన్లను కోల్పోయాడు. గత వారం హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన నివేదిక, అధిక అప్పులు తీసుకోవడం వల్ల ఏడు లిస్టెడ్ అదానీ కంపెనీల వాల్యుయేషన్ల గురించి ఆందోళనలను ఫ్లాగ్ చేస్తూ, ఆఫ్‌షోర్ టాక్స్ హెవెన్లను సక్రమంగా ఉపయోగించలేదని ఆరోపించింది. ఆస్ట్రేలియన్ రెగ్యులేటర్ ఆరోపణలను సమీక్షిస్తున్నట్లు చెప్పడంతో గ్రూపునకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. తాజా పరిణామాలతో అహ్మదాబాద్‌కు చెందిన 60 ఏళ్ల పారిశ్రామికవేత్త ఇప్పుడు ఫోర్బ్స్ సంకలనం చేసిన ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల జాబితాలో 15వ స్థానానికి పడిపోయాడు. అదానీ సంపద ఇప్పుడు $75.1 బిలియన్లుగా అంచనా వేయగా, అంబానీ $83.7 బిలియన్ల నికర విలువతో 9వ స్థానంలో ఉన్నారు.