శ్రీవారి దర్శనానికి 8గంటల సమయం
తిరుమలేశుని సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుందని టిటిడి బుల్లెటిన్ విడుదల చేసింది. 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు. శుక్రవారం నాడు స్వామి వారిని 63,731 మంది భక్తులు దర్శించుకున్నారని,ఇందులో 22,890 మంది తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. కాగా గురువారం నాటి హుండీ ఆదాయం రూ.3.94కోట్లని చెప్పింది.

