Andhra PradeshHome Page Slider

700 కోట్లతో ఉద్దానం… కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం

ఉత్తరాంధ్రలో ఉద్దానం కిడ్నీ వ్యాధులకు  700 కోట్లతో శాశ్వత పరిష్కారం చూపుతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్దానం ప్రజల నాలుగుదశాబ్దాల కల అయిన రక్షిత త్రాగునీటి సమస్యను తీర్చడానికి నడుం కట్టారు. పలాసలోని ఉద్దానం కిడ్నీ జబ్బుల బారిన పడుతూనే ఉన్నారు. వంశధార నీటిని పూర్తిగా ప్యూరిఫై చేసి, అక్కడి పల్లెలలకు కావలసిన నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి నేలలోని రాతిపొరలలో కిడ్నీ వ్యాధులకు సంబంధించిన కారకాలు ఉన్నాయని, ఎందరో పరిశోధకులు తేల్చారు. ఇక్కడ వైఎస్‌ఆర్ కిడ్నీ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌ను ప్రారంభించనున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ కూడా ఇక్కడ చేయవచ్చు.