Home Page SliderNational

సిక్కింలో మంచు చరియలు పడి 7గురు టూరిస్టుల దుర్మరణం

సిక్కింలోని గ్యాంగ్‌టక్ నుండి నాథులా వెళ్లే మార్గంలో హిమాలయాలలో మంచు చరియలు విరిగిపడి ఏడుగురు పర్యాటకులు మరణించారు. మరింతమంది ఈ మంచు చరియల క్రింద ఉంటారని భావిస్తున్నారు. ఇప్పటి వరకు భారత సైన్యం 30 మందిని రక్షించారు. గంటసేపు మంచును తొలగించిన మీదట ఒక మహిళ ప్రాణాలు నిలబడ్డాయి. కొందరిని ఆసుపత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ ఆర్మీ, సిక్కిం పోలీస్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మంచు కురుస్తుండడంతో ఈ సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రదేశానికి టూరిస్టులకు అనుమతి లేదని, కొంత దూరం వరకే అనుమతినిచ్చారని పోలీసులు చెపుతున్నారు. కానీ కొందరు పర్యాటకులు అనుమతించిన 13వ మైలు కంటే దూరం వెళ్లి పోయారని పోలీసులు తెలియజేశారు. భారీగా మంచు కురుస్తుండడంతో ముందుగానే ప్రయాణాలకు అనుమతులు రద్దు చేసామని వారు తెలిపారు. దాదాపు 80 వాహనాలలోని పర్యాటకులు ఆ ప్రదేశానికి వచ్చారని, 350 మంది వరకు మంచులో చిక్కుకుపోయారని అనుమానిస్తున్నారు.