Home Page SliderTelangana

ఒకే విడతలో 7 మేక పిల్లలు పుట్టాయి

టిజి: సాధారణంగా మేక 2 లేదా 3 పిల్లలకు జన్మనివ్వడం చూస్తాం. కానీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామంలో రేఖ వెంకన్నకు చెందిన మేక ఒకే విడతలో 7 మేక పిల్లలకు జననమిచ్చింది. అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉన్నాయని చెబుతూ.. ఇన్ని పిల్లలు పుట్టడంతో రైతు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇందులో మూడు మగవి కాగా, నాలుగు ఆడవిగా ఉన్నట్లు రైతు తెలిపారు.