గంటల్లో 600 మంది హతం..
పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు దారుణానికి ఒడిగట్టారు. బర్సాలోగో పట్టణంలో సామాన్యులపై కాల్పులకు తెగబడ్డారు. గంటల వ్యవధిలోనే దాదా పు 600 మందిని కాల్చి చంపారు. అయితే ఈ ఏడాది ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 24న బర్సాలోగో పట్టణంపై బైక్లపై దూసుకొచ్చిన ఉగ్రవాదులు కనిపించిన వారిని కాల్చేశారు. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చా యి. అల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్ అను బంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లామ్ వాల్ ముస్లిమిన్ (జేఎస్ఐ ఎం) మిలిటెంట్లు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రకటించాయి. దాదాపు మూడు రోజుల పాటు మృతదేహాలు సేకరించేందుకు సమయం పట్టిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.