Andhra PradeshHome Page Slider

సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఏంజరిగిందంటే…

సరిగ్గా 60 ఏళ్ల కిందట ఆంధ్రపత్రికలో వచ్చిన బుడమేరు వరదల వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 1964 సెప్టెంబరులో వచ్చిన బుడమేరు వరద మళ్లీ 60 ఏళ్లకు తిరిగి వచ్చిందని తెలుస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి అతివృష్టి, భారీ వర్షాలతో బుడమేరు విజయవాడపై విరుచుకుపడింది. అనేక కాలనీలు, రోడ్లు, ఇళ్లు ముంపుకు గురయ్యాయి. పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అజిత్ నగర్, సత్యనారాయణ పురం ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయని అప్పటి పత్రికలో పేర్కొన్నారు. బుడమేరుకు గండ్లు ఏర్పడి నగరంలోకి పోటెత్తింది. దీనితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. 60 ఏళ్ల క్రితం కూడా ఇలాగే బుడమేరు పొంగి ఊర్లోకి వచ్చిందని, రైలుమార్గాలు దెబ్బతిన్నాయని, అనేక రైళ్లు రద్దయ్యాయని పత్రికలో పేర్కొన్నారు. అప్పట్లో 10 మంది మరణించినట్లు ఉంది. అనేక వేల ఎకరాల పంటలు నాశనమయ్యాయని, పశువులు కొట్టుకుని పోయాయని పేర్కొన్నారు.