అమెజాన్ నుండి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో భారీగా పెట్టుబడులకు ముందుకొచ్చింది ప్రముఖ డెలివరీ సంస్థ అమెజాన్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్‌తో సీఎం రేవంత్ రెడ్డి దావోస్‌లో భేటీ ఆయ్యారు. ఈ నేపథ్యంలో రూ.60 వేలకోట్ల భారీ పెట్టుబడులు పెడతామంటూ సంస్థ అంగీకారం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వంతో ఒప్పందం జరిగింది. దీనితో రాష్ట్రంలోని డేటా సెంటర్లను విస్తరించబోతోంది. దీనికి అవసరమైన భూమిని కేటాయించేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకారం తెలిపింది.