చర్లపల్లి నుండి 60 స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతి పండుగ సందర్భంలో తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. తెలంగాణ నుండి ఏపీకి వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు క్రిక్కిరిసిపోతున్నాయి. దీనితో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడా స్టేషన్లతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ను కూడా సంక్రాంతి ప్రయాణానికి సిద్ధం చేస్తున్నారు. అంతేకాక చర్లపల్లి నుండి 60 స్పెషల్ రైళ్లు, 16 జన్ సాధారణ్ ఎక్స్‌ప్రెస్‌లు నడుపుతున్నట్లు పేర్కొంది. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లు, స్పెషల్ ట్రైన్స్‌తో కలిపి ఈ నెల 11 నుండి 25 వరకూ 188 రైళ్లు నడుస్తాయని వెల్లడించింది.