ఒకేసారి 6 వేల కోళ్ళు..
ఒకేసారి 6 వేల కోళ్లు చనిపోవడంతో పౌల్ట్రీఫామ్ యజమాని షాక్ కు గురయ్యాడు. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్ జిల్లా గంగాధర శివారులోని ఓ పౌల్ట్రీ ఫాం లో జరిగింది. పౌల్ట్రీఫామ్ యజమాని ఇప్పలపల్లి నర్సయ్య తెలిపిన వివరాలు ప్రకారం.. లక్ష్మీదేవిపల్లె గ్రామం గంగాధర శివా రులోని తన పౌల్ట్రీ ఫామ్ లో ఉన్నట్టుండి 6వేల కోళ్లు చనిపోయాయని చెప్పాడు. విషయాన్ని వెటర్నరీ డాక్టర్ కు చెప్పగా పరిశీలించి బర్డ్ ఫ్లూ కాదని తెలిపారని వెల్లడించాడు. అతడి సూచన మేరకు చనిపోయిన కోళ్లను గుంత తీసి పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నాడు.