మల్లేపల్లిలో 6 దుకాణాలు కూల్చివేత
హైదరాబాద్ లోని నాంపల్లి నియోజకవర్గ పరిధి మల్లేపల్లి కూడలి వద్ద పలు దుకాణాలను ఇవాళ జీహెచ్ఎంసీ, టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూల్చివేశారు. రహదారి విస్తరణలో భాగంగా ఆరు షాపులను నేలమట్టం చేశారు. హైవే విస్తరణ కోసం సదరు దుకాణాలకు అధికారులు గతంలోనే నోటీసులు ఇచ్చారు. తాజాగా కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

