బహిరంగంగా తాగితే 6 నెలలు జైలుశిక్ష!
తెలంగాణలో బహిరంగంగా మద్యం తాగే వారికి రాష్ట్ర పోలీస్ శాఖ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చట్టరీత్యా నేరం. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం ప్రజలకు, స్థానికులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలా రోడ్లపై కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ మద్యం సేవించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. ఈ నేరానికి 6 నెలల వరకు జైలుశిక్ష పడుతుంది అని ట్వీట్ యొక్క సారాంశం.

