NationalNews

రేపట్నుంచే దేశంలో 5జీ టెలికామ్ సేవలు…

ప్రతిష్టాత్మక 5జీ నెట్ వర్క్ ఇండియాలో రేపట్నుంచి అందుబాటులోకి రానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా 5జీ సిగ్నల్స్ విడుదల కానున్నాయి. ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న 5 జీ సిగ్నల్స్ రాకతో దేశంలోని టెలికామ్, మీడియా రంగాల్లో సమూల మార్పులు రాబోతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు చాన్నాళ్ల కిందటే ప్రారంభమైనప్పటికీ… ఇండియాలో మాత్రం కొంచెం ఆలస్యంగా ఈ సేవలను ప్రారంభిస్తున్నారు. ఐతే మిగతా దేశాల కంటే వేగంగా దేశంలో 5జీ సేవలను విస్తరించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది.

ఇప్పటికే 4జీ అందుబాటులో ఉన్న అన్ని ఏరియాల్లో 5జీని అందించేందుకు టెలికామ్ ఆపరేటర్లు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో మోదీ 5 జీ సేవలను జాతికి అంకితం చేస్తారు. దేశంలో 5 జీ ఎక్కడెక్కడ అందుబాటులోకి రాబోతుందన్నదానిపై మాత్రం ఆపరేటర్లు, ప్రభుత్వం కొంత సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నాయ్. 4జీతో పోల్చుకుంటే 5జీ అత్యంత వేగవంతమైన నెట్ వర్క్ అందిస్తుంది. ఎంత పెద్ద ఫైల్ అయిన చిటెకెలో డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. 5జీ సేవల కోసం రిలయన్స్ జియో 88 వేల కోట్లు వెచ్చించగా… ఎయిర్ టెల్ 43 వేల కోట్లు, వోడాఫోన్ ఐడియా 18 వేల కోట్లు ఖర్చు చేశాయ్. రేపట్నుంచి పలు నగరాల్లో 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయ్.