ఇకపై రూ.500/-లకే రాజస్థాన్‌లో గ్యాస్ సిలిండర్
రాజస్థాన్‌లో గ్యాస్ వినియోగ దారులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదేంటంటే రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గించినట్లు ప్రకటించింది. కాగా రాజస్థాన్‌లో ఈ రోజు నుంచి గ్యాస్ సిలిండర్‌ను రూ.500/- రూపాయలకే అందించనున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఈ విషయాన్ని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ తాజాగా ప్రకటించారు. అయితే దీనిని ఇందిరా గాంధీ గ్యాస్ పథకం కింద అందించునున్నట్లు సీఎం వెల్లడించారు. దీంతో రాజస్థాన్‌లోని 14 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ఆయన తెలిపారు. దీని ద్వారా ఒక్కో సిలిండర్‌పై రూ.640/- సబ్సీడీ ఇవ్వనున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్ పేర్కొన్నారు.ఇటీవ కాలంలో కర్ణాటకలో జరగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇంతటి భారీ గెలుపుకు కారణం కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే అని పలువురు ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి విజయాన్నే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఉవ్విళ్లూరుతుంది. దీనిలో భాగంగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను క్రమక్రమంగా అమలు చేస్తున్నట్లు కన్పిస్తోంది.

