ఆర్జీకర్ ఆసుపత్రిలో 50 మంది వైద్యుల రాజీనామా..
జూనియర్ డాక్టర్ల చప్పట్ల మధ్య సంచలన ఆర్జీకర్ ఆసుపత్రిలోని 50 మంది సీనియర్ వైద్యులు, ఫాకల్టీలు రాజీనామాలు చేశారు. కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఈ నేపథ్యంలో అక్కడి జూనియర్ వైద్యులు పలు డిమాండ్ల సాధనకు గత ఐదురోజులుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గకపోవడంతో సీనియర్లు 50 మంది వారికి మద్దతుగా మంగళవారం మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. ఆసుపత్రిలో అవినీతి సిండికేట్లకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు డాక్టర్లు. ఆసుపత్రిలో సీసీటీవీలు, రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులకు ఒకే రకమైన రక్షణ వ్యవస్థ, వాష్ రూమ్స్ వంటి డిమాండ్లతో వారు నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఆసుపత్రులలో పోలీస్ రక్షణ, వైద్యుల ఖాళీలను భర్తీ చేయడం వంటి అంశాలతో వారు నిరసనలు చేస్తున్నారు.