‘అంబేడ్కర్ పేరిట అవార్డు’ కోసం 50 కోట్ల రూపాయల నిధి- కేసీఆర్
అంబేడ్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట రాష్ట్రప్రభుత్వం ఏటా అవార్డులనిస్తుందని తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీనికోసం 50 కోట్ల రూపాయలతో నిధి ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ సంవత్సరం అంబేడ్కర్ జయంతి రోజున ఈ అవార్డు ప్రధానం చేస్తామన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరుగుతున్న 125 అడుగుల ఎత్తైన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. మరోపక్క పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. దళితబంధు పథకం నిరవధికంగా అమలుచేస్తామన్నారు.