Home Page SliderTelangana

తెలంగాణకు 466 కొత్త అంబులెన్స్‌లు

అత్యవసర సేవల కోసం ఉపయోగించే అంబులెన్స్‌లను రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా  కొత్తగా 466 అంబులెన్స్‌లు వినియోగం లోనికి రానున్నట్లు తెలిపారు. వీటిలో 108 వాహనాలు 204, అమ్మఒడి వాహనాలు 228, పార్థివ దేహాలను తరలించడానికి 34 చొప్పున వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యమంత్రి హరీశ్ రావు, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి, ఇతర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణాకు కుటుంబపెద్దగా వ్యవహరిస్తున్నారని, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తోందన్నారు. కొన్ని రాష్ట్రాలలో స్కామ్‌లు మాత్రమే ఉంటాయని, కానీ తెలంగాణలో స్కీములు ఉంటాయని పేర్కొన్నారు. తాజాగా ఆశావర్కర్లకు సెల్‌ఫోన్స్, వాటి  బిల్లులను కూడా ప్రభుత్వమే ఇస్తుందని ప్రకటించారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక ప్రభుత్వ ఆసుపత్రులలో 70 శాతం ప్రసవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.