News

రికార్డ్ స్థాయిలో ఐదు రోజులకే రైతుల ఖాతాల్లో 427 కోట్లు జమ

రైతులకు అండగా జగన్ సర్కార్
తడిసిన ధాన్యం సైతం కొనుగోలు
రబీ సీజన్‌లో రూ. 1,277 కోట్లు జమ
5 రోజులకే రైతులకు చెల్లింపు

అకాల వర్షాలతో తడిసిన, మొలకెత్తిన, రంగుమారిన ధాన్యం కొనుగోలు విషయంలో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను కీలక ఆదేశాలను జారీ చేశారు. ఆయన సూచనలకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా గతంలో ఎన్నడు చెయ్యలేని విధంగా అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం రైతులకు కేవలం ఐదు రోజులకే పంట నష్టం తాలుకా డబ్బులను వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రైతు బావుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించి రాష్ట్రంలోని రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వాటిని పరిష్కారించి వారికి ఆర్ధికంగా తోడ్పాటును అందిస్తూ వారిని అందుకుంది. దీనిలో భాగంగా ఈరోజు ఒక్కరోజే రాష్ట్రంలో ఉన్న 32,558 రైతులకు 474 కోట్లను జమ చేసింది. అంతేకాకుండా మొత్తంగా చూస్తే రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం జమ చేసింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 82.58 శాతం రైతులకు డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. వాస్తవానికి డబ్బులను ఖాతాల్లో జమ చెయ్యటానికి 21 రోజులు సమయమున్నా.. ప్రభుత్వం అకాల వర్షాలతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను చూసి 5 రోజులకే రైతులకు చెల్లింపులు చేసింది. అంతేకాకుండా జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమ చేసిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.